హిందూపురంలో దారుణం.. యువకుడి హత్య

by Thanuru Gopichand |

హిందూపురంలో (Hindupuram) దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు హత్యకు (Murder) గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

హిందూపురంలో దారుణం.. యువకుడి హత్య
X

దిశ, వెబ్ డెస్క్ : హిందూపురంలో (Hindupuram) దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు హత్యకు (Murder) గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అంబేడ్కర్ కూడలిలోని డార్మెటరీలో ఈ ఘోరమైన ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం హిందూపురం వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఓ డార్మిటరీ ఉంది. అక్కడికి మోద గ్రామానికి చెందిన ఓ యువకుడు వెళ్లాడు. రాత్రివేళ అక్కడే బస చేశాడు. ఈ క్రమంలో అక్కడున్న మరో వ్యక్తితో అతనికి వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరగడంతో ఇద్దరి మధ్య ఘర్షణ మరింత ఎక్కువైంది. ఆవేశంలో మరో వ్యక్తి మోద గ్రామానికి చెందిన యువకుడిపై దాడికి దిగాడు. అతని దాడిలో గాయపడిన బాధితుడు స్పృహ కోల్పోయాడు. అయితే తీవ్రంగా గాయాలవ్వడంతో బాధితుడు మరణించాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డార్మిటరీలో ఘటన విషయమై విచారించారు. నిర్వాహకులు, అక్కడ బస చేసిన వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే సెల్ ఫోన్ విషయమై జరిగిన వాగ్వాదం వల్లే గొడవ జరిగిందని.. ఈ గొడవలో మోద గ్రామానికి చెందిన యువకుడు మరణించాడని తెలుస్తోంది.

Next Story