విశాఖలో దారుణం.. నవ వధువు ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-14 06:43:18  IST  )

విశాఖలో దారుణం జరిగింది...

విశాఖలో దారుణం.. నవ వధువు ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో దారుణం జరిగింది. భర్త వేధింపులు భరించలేక నవ వధువు(New Bride) బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్త పోర్న్ వీడియోలకి బానిసగా మారి ఆ వీడియోల‌లో ఉన్నట్టు చేయాలని సైకో లాగా ప్రవర్తించారు. అయితే భర్త వేధింపులను భార్య కొద్ది రోజులు భరించారు. ఈ మధ్యకాలంలో భర్త వికృత చేష్టలు మరింతగా పెరిగిపోయాయి. దీంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు నాగేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నిందితుడిని కఠనంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది.

Next Story