- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: గోవాలో ఏపీ యువకుడు దారుణ హత్య
గోవాలో దారుణం జరిగింది..

దిశ, వెబ్ డెస్క్: గోవా(Goa)లో దారుణం జరిగింది. తాడేపల్లిగూడెం(Tadepalligudem) యువకుడు హత్యకు గురయ్యారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు డిసెంబర్ 29న తాడేపల్లిగూడేనికి చెందిన ఎనిమిది మంది యువతీయువకులు గోవా ట్రిప్ వెళ్లారు. అదే రోజు రాత్రి భోజనం చేసేందుకు అక్కడ ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అయితే యువతి పట్ల రెస్టారెంట్ యజమాని కుమారుడు అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో వారిని తాడేపల్లిగూడెం యువకులు ప్రశ్నించారు. ఈ క్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచక్షణ రహితంగా కర్రలతో తాడేపల్లి యువకులపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రవితేజని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు గోవాలో కేసు నమోదు అయింది. అయితే తాడేపల్లిగూడెంలో రవితేజ కుటుంబం ఆందోళనకు దిగింది నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. అక్కడి ప్రభుత్వం స్పందించి రవితేజ కుటుంబానికి న్యాయం చేయాలని అటు స్థానికులు సైతం డిమాండ్ చేశారు. గోవాలో జరిగిన రవికిరణ్ హత్య విషయాన్ని కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తమ సోదరుడు తెలిపారు.






