మాజీ మంత్రి రజినీపై అట్రాసిటీ కేసు

by Thanuru Gopichand |

మాజీ మంత్రి విడదల రజినీపై అట్రాసిటీ కేసు నమోదైంది.

మాజీ మంత్రి రజినీపై అట్రాసిటీ కేసు
X

దిశ, ఏపీ బ్యూరో : మాజీ మంత్రి విడదల రజినీపై అట్రాసిటీ కేసు నమోదైంది. సోషల్ మీడియా పోస్టుల విషయంలో గత ప్రభుత్వంలో తనను వేధించిన విడదల రజినీపై కేసు నమోదు చేయాలని ఐటీడీపీకి చెందిన పిల్లి కోటి హైకోర్టును ఆశ్రయించారు. తనను కొడుతూ అప్పటి సీఐ వీడియో కాల్ ద్వారా రజనీకి చూపించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె పీఏలు కూడా ఇందులో ఉన్నారని వివరించారు. కోటి పిటిషన్ పరిశీలించి చర్యలు చేపట్టాలని పల్నాడు జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విడదల రజినీపై చిలకలూరిపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story