కానిస్టేబుల్ అఘాయిత్యం.. మత్తుమందు ఇచ్చి మహిళపై అత్యాచారం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-25 08:27:29  IST  )

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది..

కానిస్టేబుల్ అఘాయిత్యం.. మత్తుమందు ఇచ్చి మహిళపై అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoor District)లో దారుణం జరిగింది. సాయం కోసం వ‌చ్చిన తనపై కానిస్టేబుల్(Constable) అఘాయిత్యానికి పాల్పడినట్లు పలమనేరు గంటావూరుకు చెందిన బాధితురాలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు కానిస్టేబుల్‌తో పాటు హోంగార్డు కూడా వేధిస్తున్నారని ఆరోపించారు. ఇద్దరి నుంచి రక్షణ కల్పించాంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తనను లైంగికంగా వేధించారని వాపోయారు. కానిస్టేబుల్ ఉమాశంకర్ తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని ఆరోపించారు. అంతేకాదు విషయం బయటకు చెబితే తన ముగ్గురు పిల్లలను చంపేస్తానని బెదిరించినట్లు చెప్పి కన్నీరు పెట్టుకున్నారు. తనను వేధించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story