- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నంద్యాల జిల్లాలో దారుణం.. వీధికుక్కల దాడిలో బాలుడు మృతి
నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా(Nandyala District)లో దారుణం చోటు చేసుకుంది. వీధి కుక్కల(Dogs) దాడిలో మూడేళ్ల బాలుడు మృతి చెందారు. బేతంచర్ల హనుమాన్ కాలనీ(Betanchera Hanuman Colony)కి చెందిన మూడేళ్ల బాలుడు మోదీన్(Boy Modin) రోజు మాదిరిగా ఆడుకుంటున్నారు. అయితే మోదీన్‌పై వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. విచక్షణ రహితంగా కరిచాయి. ముఖం, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలుడిని ఆస్పత్రికి తరలించారు.
అయితే చికిత్స పొందుతూ మోదీన్ మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. మోదీన్ మృతికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అటు స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు కుక్కల దాడి ఘటనలు జరిగినా అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంపై మండిపడ్డారు
Next Story






