ప్రియురాలిని చంపి.. ఆమె చెల్లికి ఫోన్ చేసి చంపేశానని చెప్పిన ప్రేమోన్మాది

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-13 09:10:33  IST  )

నెల్లూరులో దారుణం జరిగింది. ..

ప్రియురాలిని చంపి.. ఆమె చెల్లికి ఫోన్ చేసి చంపేశానని చెప్పిన ప్రేమోన్మాది
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు(Nellore)లో దారుణం జరిగింది. ప్రేమోన్మాది నిఖిల్ రెచ్చిపోయాడు. ప్రేమించిన యువతిని కత్తితో దారుణంగా పొడిచి చంపారు. హత్య అనంతరం మృతురాలి చెల్లెలికి ఫోన్ చేశాడు. గొడవ జరిగిందని, మీ అక్కను చంపేశానని తెలిపాడు. ఆ తర్వాత దర్గామిట్ట పోలీస్ స్టేషన్‌లో నిఖిల్ లొంగిపోయాడు.

అయితే ఈ ఘటన ఒక్కసారిగా నెల్లూరులో కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించే చర్యలు చేపట్టారు. మరోవైపు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Next Story