- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల్లూరులో దారుణం.. బస్సు డ్రైవర్, కండక్టర్‌పై కత్తులతో దాడి
నెల్లూరు బోసుబొమ్మ సెంటర్‌లో దారుణం జరిగింది..

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు బోసుబొమ్మ సెంటర్(Nellore Bosubomma Center)లో దారుణం జరిగింది. ఆకతాయిల రెచ్చిపోయారు. సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్(Driver, conductor)పై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. హారన్ కొట్టినా సైడ్ ఇవ్వలేదనే కోపంతో కండక్టర్, డ్రైవర్‌పై ముగ్గురు యువకులు దాడి చేశారు. దీంతో పోలీసులకు ఆర్టీసీ సిబ్బంది ఫిర్యాదు చేసింది. నిందితులను శిక్షించాలని కోరింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఈ మధ్య కాలంలో చిన్న విషయానికే ఆర్టీసీ డ్రైవర్లపై కొందరు దాడులకు దిగుతున్నారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు మరి ఎక్కువయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై దాడుల చేస్తే కఠిన శిక్షలు తప్పవని బస్సులో రాసి ఉన్నప్పటికీ కొందరు ఆకతాయిలు పట్టించుకోవడం లేదు. చిన్న చిన్న కారణాలకే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బూతులు మాట్లాడుతూ దాడులకు దిగుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.






