మంగళగిరి ఎయిమ్స్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం.. సెక్యూరిటీ సూపర్ వైజర్ అరెస్ట్

by Vemula.Srinu Prasad |

మంగళగిరి ఎయిమ్స్‌లో దారుణం జరిగింది. సెక్యూరిటీ సూపర్ వైజర్ మోహన్ చారి లైంగిక వేధింపులు తాళ్లలేక మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త చనిపోవడంతో ఆమె ఎయిమ్స్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు....

మంగళగిరి ఎయిమ్స్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం.. సెక్యూరిటీ సూపర్ వైజర్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: మంగళగిరి ఎయిమ్స్‌(Mangalagiri Aims)లో దారుణం జరిగింది. సెక్యూరిటీ సూపర్ వైజర్ మోహన్ చారి లైంగిక వేధింపులు తాళ్లలేక మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త చనిపోవడంతో ఆమె ఎయిమ్స్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. కొంతకాలంగా మోహన్ చారి వేధిస్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో అవి మరింత ఎక్కువ అయ్యాయి. తనను వేధించొద్దని వేడుకున్నా సూపర్ వైజర్ వినిపించుకోలేదు. ప్రతి రోజు రాత్రి సమయంలో ఫోన్లు చేసి మరీ విసిగించారు. తాను చెప్పినట్లు వినాలని, లేనిపక్షంలో ఉద్యోగం తీయించివేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనస్థాపం చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మోహన్ చారిని అరెస్ట్ చేశారు.

Next Story