దారుణం.. అమెరికాలో తెలుగు యువకుడు దారుణ హత్య

by Disha Web Desk 4 |
దారుణం.. అమెరికాలో తెలుగు యువకుడు దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు యువకుడు అమెరికాలో దారుణ హత్యకు గురికావడం విషాదం నింపింది. అమెరికాలో దోపిడీ ముఠా చేతిలో పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ హత్యకు గురయ్యాడు. వీర సాయిష్ అక్కడ ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే దోపిడీ చేసేందుకు వచ్చిన దుండగులను అడ్డుకునేందుకు యత్నించగా సాయిష్‌పై దుండగులు కాల్పులు జరిపారు.

ఒహియోలోని వెస్ట్ కొలంబస్‌లో అర్ధరాత్రి 12.50‌కి ఘటన చోటు చేసుకుంది. సాయిష్ ఇటీవలే హెచ్ 1 బీ వీసా దక్కించుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు తమ కష్టాలు తీరాయని భావించారు. రెండు వారాల్లో బంక్‌లో ఉద్యోగం మానేద్దామని కూడా సాయిష్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంతలోనే విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఏడాది కొలంబస్ లో ఇది 50వ హత్య అని అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed