బొత్స సీడ్స్ ప్యాకెట్ చూపించి నెయ్యి అంటున్నారు.. వైసీపీ నేతలపై అచ్చెన్నాయుడు ఫైర్

by Ajay Maddhiboyina |

ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్ కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. వైసీపీ నేతలు ఏమాత్రం తెలుసుకోకుండా ఆందోళన చేస్తున్నారని అన్నారు.

బొత్స సీడ్స్ ప్యాకెట్ చూపించి నెయ్యి అంటున్నారు.. వైసీపీ నేతలపై అచ్చెన్నాయుడు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్ కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. వైసీపీ నేతలు ఏమాత్రం తెలుసుకోకుండా ఆందోళన చేస్తున్నారని అన్నారు. హెరిటేజ్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే వైసీపీ నాయకులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో సీడ్స్ ప్యాకెట్ చూపిస్తూ నెయ్యి అని చెబుతున్నారని విమర్శించారు. సీనియర్ నేతకు కనీసం నెయ్యికి విత్తనాల ప్యాకెట్ కు సంబంధం తెలియదా అని ప్రశ్నించారు.

దానికి హెరిటేజ్ సంస్థ నోటీసులు కూడా ఇచ్చిందని అన్నారు. హెరిటేజ్ సంస్థకు ఇందాపూర్ డెయిరికీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఎలాంటి ఆధారాలు ఉన్నా తీసుకురావాలని చెప్పారు. హెరిటేజ్ సంస్థ ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంతో కూడా వ్యాపారలావేదేవీలు జరపకూడదని హెరిటేజ్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గత ప్రభత్వం హయాంలో సాక్షి పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని అన్నారు. ప్రతిరోజూ ఒకే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చి సభా సమయాన్ని వృథా చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

Next Story