- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Assembly Meetings:నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు
by Jakkula.Mamatha |
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Meetings) కొనసాగుతున్న విషయం తెలిసిందే.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు((AP Assembly Meetings) కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల(నవంబర్) 11వ తేదీన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అయితే నేడు పదవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటలకు శాసన సభ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నేడు అసెంబ్లీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ‘రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం సాగించిన విధ్వంసం, కూటమి ప్రభుత్వంలో రాజధాని పునర్నిర్మాణానికి చేపడుతున్న చర్యలు’ అనే అంశంపై నేడు సభలో చర్చ జరగనుంది. అనంతరం 2047-విజన్ డాక్యుమెంట్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన రిలీజ్ చేయనున్నారు. వరదలు, రుషికొండ ప్యాలెస్ తదితర అంశాలపైనా చర్చిస్తారని సమాచారం.
Next Story






