మద్యం మత్తులో రెచ్చిపోయిన ఏఎస్ఐ.. హోటల్ నిర్వాహకులపై దాడి

by Vemula.Srinu Prasad |

మద్యం మత్తులో ఓ ఏఎస్ఐ రెచ్చిపోయారు. హోటల్ నిర్వాహకులతో గొడవకు దిగారు. దీంతో పరస్పరం దాడులు చేసుకున్నారు..

మద్యం మత్తులో రెచ్చిపోయిన ఏఎస్ఐ.. హోటల్ నిర్వాహకులపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్: మద్యం మత్తులో ఓ ఏఎస్ఐ రెచ్చిపోయారు. హోటల్ నిర్వాహకులతో గొడవకు దిగారు. దీంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటన తిరుపతి సత్యనారాయణపురంలో జరిగింది. స్థానిక పూర్విక కర్రీ సెంటర్‌కు ఏఎస్ఐ రాము వెళ్లి బిర్యానీ, చికెన్ కర్రీ పార్సిల్ తీసుకున్నారు. అయితే డబ్బులు ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో బిల్లు చెల్లించాలని ఆయనను హోటల్ సిబ్బంది అడిగారు. దీంతో సదరు ఏఎస్ఐ ఆగ్రహానికి గురయ్యారు. తాను పోలీసునని, తనకు ఉచితంగానే ఇవ్వాలంటూ వాదనకు దిగారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. వెంటనే ఈ గొడవ కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసింది. కోపంతో పరస్పరం భౌతిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఏఎస్ఐ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకున్న తిరుబండారాలకు డబ్బులు ఇవ్వకుండా దాడి చేయడమేంటని ప్రశ్నించారు. పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story