తెలుగుభాష ఉన్నంత వరకు టిడిపి జెండా ఎగురుతూనే ఉంటుంది

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-28 06:38:53  IST  )

తెలుగు భాష, తెలుగు జాతి,తెలుగు నేల, తెలుగువారు ఉన్నంత వరకు అన్న ఎన్టీఆర్‌తో పాటు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూనే ఉంటుందని మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు.

తెలుగుభాష ఉన్నంత వరకు టిడిపి జెండా ఎగురుతూనే ఉంటుంది
X
  • మాజీ కేంద్రమంత్రి ఆశోక్ గజపతి రాజు
  • ఎన్టీఆర్ పైనా వేధింపు కేసులు
  • 10 వేల దుర్వినియోగం కేసులో కోర్టుకు ఎన్టీఆర్ హాజరు
  • గత పాలకుడు రూ.43 వేల కోట్ల అక్రమాస్తుల్లో వాయిదాల్లో గిన్నిస్ రికార్డ్

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు భాష, తెలుగు జాతి,తెలుగు నేల, తెలుగువారు ఉన్నంత వరకు అన్న ఎన్టీఆర్‌తో పాటు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూనే ఉంటుందని మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడు రెండో రోజైన బుధవారం టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102 జయంతి సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని వివరించారు అన్న ఎన్టీఆర్ కూడా వేధింపులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. పది వేల రూపాయలు నగదు చెల్లింపులు చేశారన్న కారణంగా కేసు పెట్టి ఆయనను కోర్టుకి పిలిచారని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో అన్న ఎన్టీఆర్ కోర్టుకు హాజరై చట్టాలు, న్యాయస్థానాలను గౌరవించారని చెప్పారు. గత పాలకుడు మాదిరిగా 43 వేల అక్రమాస్తుల కేసులో కూడా కోర్టుకు వెళ్లకుండా వాయిదాలు తెచ్చుకోలేదని విమర్శించారు. వాయిదాలో జగన్‌ది గిన్నిస్ రికార్డు అని మాజీ కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు.

Also Read..


దిశ’ మహానాడు సంచిక చాలా బాగుంది.. CM చంద్రబాబు ప్రశంస

CM చంద్రబాబు చేతిలో ‘దిశ’ ప్రత్యేక సంచిక


Next Story