- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్ని మతాలను గౌరవించే వాడే లీడర్.. జగన్‌పై అశోక్ గజపతి రాజు హాట్ కామెంట్స్
అన్ని మతాలను గౌరవించే వాడే నిజమైన నాయకుడు అవుతాడని గోవా గవర్నర్, పైడితల్లి ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అన్ని మతాలను గౌరవించే వాడే నిజమైన నాయకుడు అవుతాడని గోవా గవర్నర్, పైడితల్లి ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) అన్నారు. ఇవాళ ఆయన విజయనగరంలో (Vizianagaram) మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ (YCP) ప్రభుత్వంలో ఎండోమెంట్ అధికారులంతా మంత్రులు బూట్లు నాకుతూ కూర్చుకున్నారని ఫైర్ అయ్యారు. ఐదేళ్ల కాలంలో ఆలయాల అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని ఆరోపించారు. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న ఆలయాల పట్ల చిన్నచూపు చూశారని ధ్వజమెత్తారు.
నాడు దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న పొట్టోడు (వెల్లంపల్లి శ్రీనివాస్) నయా పైసా పని చేయలేదని ఆరోపించారు. ఆలయాల్లో ట్రస్ట్ బోర్డులు పారదర్శకంగా పని చేయాలన్నారు. అధికారులు ఉత్సవ విగ్రహాలుగా కూర్చోకూడదని.. దేవుడికి సేవ చేయాలని సూచించారు. అధికారులు పెత్తనాలు చేయకూడదని.. భక్తుల మనోభావాలు, విజ్ఞప్తులు ఏంటో తెలుసుకుని పని చేయాలని వార్నింగ్ ఇచ్చారు. సొంత మతాన్ని ఆరాధించాలని.. అన్య మతాలను గౌరవించాలని పేర్కొన్నారు. అన్ని మతాలను గౌరవించిన వాడే నిజమైన నాయకుడు అవుతాడని జగన్‌ను ఉద్దేశించి అశోక్ గజపతి రాజు కామెంట్ చేశారు.






