గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు... రియాక్షన్ ఇదే...

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-14 13:07:00  IST  )

గవర్నర్ పదవి వస్తుందని తాను ఊహించలేదని అశోక్ గజపతిరాజు అన్నారు..

గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు... రియాక్షన్ ఇదే...
X

దిశ, వెబ్ డెస్క్: గోవా గవర్నర్‌‌(Goa Governor)గా అశోక్ గజపతిరాజు(Ashok Gajapathi Raju) నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. తనకు గవర్నర్ పదవి దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ పదవి వస్తుందని తాను ఊహించలేదన్నారు. అధిష్టానం చెప్పిన పనిని చేయడమే తన సిద్ధాంతమని చెప్పారు. ప్రధాని మోడీ(Prime Minister Modi)తో కలిసి పని చేసిన అనుభవం ఉందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. ఎలా పని చేయాలో రాజ్యాంగ నిర్మాతలు దిశానిర్దేశం చేశారని తెలిపారు. కలిసికట్టుగా పని చేస్తే భావితరాలకు మంచి దేశాన్ని ఇచ్చినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో అన్ని ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాలన్నారు. దేశానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తానని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు.

Next Story