- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీతి, నిజాయితీకి మారుపేరు అశోక్ గజపతిరాజు :హోంమంత్రి అనిత
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజును ఇటీవల కేంద్రప్రభుత్వం గోవా గవర్నర్‌గా నియమించిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజును ఇటీవల కేంద్రప్రభుత్వం గోవా గవర్నర్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు(Ashoka gajapathi raju) నియమితులు కావడం పై ఏపీ(Andhra pradesh) హోం మంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) స్పందించారు. ఈ నేపథ్యంలో గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియమితులు కావడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ తరుణంలో ఇవాళ(శనివారం) హోం మంత్రి అనిత విజయనగరం(Vizianagaram)లోని నివాసంలో అశోక్ గజపతిరాజును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అజాత శత్రువుగా పేరు పొందిన వ్యక్తి అశోక్ గజపతిరాజు అని అలాంటి వ్యక్తిని గత వైసీపీ(YSRCP) ప్రభుత్వం అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిందన్నారు. రాజకీయాల్లో ఎలాంటి ఆరోపణలు లేని వ్యక్తి అశోక్ గజపతిరాజు.. నీతికి నిజాయితీకి మారుపేరు ఆయన అంటూ హోం మంత్రి అనిత కొనియాడారు. ఆయన 50 ఏళ్లుగా విజయనగరం జిల్లాకు అనేక సేవలు చేశారని గుర్తుచేశారు. మాన్సాస్ ట్రస్టును నడుపుతున్న మంచి మనసున్న వ్యక్తి అని హోం మంత్రి అనిత తెలిపారు. అశోక్ గజపతిరాజును చూసి మేము ఎంతో నేర్చుకున్నామని ఆమె పేర్కొన్నారు.






