- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసుల తీరుపై ఆర్యవైశ్యుల ఆగ్రహం
పొదిలి (Podili) పోలీసుల తీరుపై ఆర్యవైశ్యుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వ్యాపారులతో పోలీసు సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది.

దిశ, వెబ్ డెస్క్ : పొదిలి (Podili) పోలీసుల తీరుపై ఆర్యవైశ్యుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వ్యాపారులతో పోలీసు సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో పొదిలి ఆర్యవైశ్య సంఘం (Arya Vysya Sangam), ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం, చాంబర్ ఆఫ్ కామర్స్ పొదిలి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. లారీ అన్ లోడ్ విషయంలో ఎరువుల వ్యాపారి యాదాల కోటేశ్వర రావు, ఆయన కుమారుడు అవినాశ్ ను పొదిలి పోలీసులు తీవ్రంగా కొట్టడాన్ని వారు ఖండిస్తున్నారు. ఈ దాడిని ఆర్యవైశ్యులపై దాడిగా పరిగణిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.
ఆర్యవైశ్య సంఘ నాయకుల వివరాల ప్రకారం.. డిసెంబర్ 24న సాయంత్రం గంటలకు యాదాల కోటేశ్వర రావు (Yadala Koteshwara Rao) కుమారుడు యాదాల అవినాశ్ (Yadala Avinash) పొదిలి మెయిన్ రోడ్డులోని తమ షాప్ ముందు సరుకును దింపుతున్నారు. అందుకోసం లారీని షాప్ ముందర ఉంచారు. ఈ క్రమంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అక్కడకు వచ్చిన పొదిలి పోలీసు సిబ్బంది లారీ డ్రైవరును అకారణంగా కొట్టడమే కాకుండా, అవినాశ్ ను కూడా లాఠీతో కొట్టారని.. చొక్కా పట్టుకొని ఈడ్చుకెళ్లి పోలీసు జీపులో ఎక్కించి దారి పొడుగున పిడ్డిగుద్దులు గుద్దుతూ పోలీసు స్టేషన్ తీసుకెళ్లారని, స్టేషనులో సైతం చితకబాదారని ఆరోపించారు.
కుమారుడి కోసం పోలీసు స్టేషనుకు వచ్చిన కోటేశ్వర రావును సైతం పోలీసు సిబ్బంది దబాయించడమే కాకుండా, అసభ్య పదజాలంతో దూషిస్తూ చెంప దెబ్బలు కొట్టారని చెబుతున్నారు. అంతేకాకుండా తండ్రి కొడుకు నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని పేర్కొంటున్నారు. రౌడీలు, గూండాలు, అత్యాచార నిందితుల కంటే హీనంగా పోలీసులు వ్యాపారులతో ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో పరువు మర్యాదలు గల ఆర్యవైశ్యులపై ఇటువంటి దాడులు సరికాదన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ఆర్యవైశ్య వ్యాపారులైన కోటేశ్వర రావు, ఆయన కుమారుడు అవినాశ్ పై దాడి చేసిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్య సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.






