- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రదర్శన కోసం వచ్చి కళాకారిణి మృతి
గుడిలో ప్రదర్శన కోసం వచ్చిన ఓ యువ కళాకారిణి ప్రమాదవశాత్తు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.

దిశ, వెబ్ డెస్క్ : గుడిలో ప్రదర్శన కోసం వచ్చిన ఓ యువ కళాకారిణి ప్రమాదవశాత్తు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. సీఐ నరేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శివకోటిలోని పుంతలో ముసలమ్మ కుంతలేశ్వరి అమ్మవారి తీర్థ మహోత్సవాల ప్రారంభం సందర్భంగా రాజమహేంద్రవరం నుంచి 12 మందితో కూడిన నాట్య బృందం తెల్లవారుజామున చేరుకుంది. వారికి ఆలయం ఎదురుగా ఉన్న నిర్మాణంలో ఉన్న మండపంలో పై అంతస్తు గదులు కేటాయించారు.
బృంద సభ్యురాలైన పదిహేడేళ పాలపర్తి భవ్యశ్రీ ప్రదర్శనకు సిద్ధమై కిందకు దిగుతున్న సమయంలో కాలుజారి పడిపోవడంతో తలకు తీవ్ర గాయమయ్యాయి. వెంటనే రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మెట్లకు రక్షణ గోడలు లేకపోవడం ప్రమాదానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






