- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తుల కోసం తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల ఇబ్బందుల్ని తొలగించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI Intelligence)ను ఉపయోగించాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల ఇబ్బందుల్ని తొలగించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI Intelligence)ను ఉపయోగించాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) వెల్లడించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం (LV Subrahmanyam) ఏఐ టెక్నాలజీకి స్వస్తి పలకాలని చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Queue Complex)లో స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎదుర్కొంటోన్న సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్, టీసీఎస్ వంటి సంస్థల సహకారంతో ఫ్రీగా అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీని వాడాలని నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో వివరించారు. క్యూలో ఉన్న భక్తులకు 2 గంటల్లో దర్శనం కల్పించాలన్న లక్ష్యంతో టీటీడీ పనిచేస్తోందని, ఈ సమయంలో మాజీ ఈఓ చేసిన వ్యాఖ్యలు సబబు కాదని తెలిపారు. సీనియర్ ఐఏఎస్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన.. భక్తుల్లో గందరగోళం సృష్టించేలా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ప్రపంచం మొత్తం వాడుతోన్న ఏఐ టెక్నాలజీని టీటీడీ కూడా వాడటం మంచిదేనన్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తుల్ని గంటలు, రోజుల తరబడి షెడ్లు, కంపార్ట్ మెంట్లలో బంధించి ఉంచే కంటే ఇలా టెక్నాలజీని వాడి వారి ఇబ్బందుల్ని తొలగించడం ఎంతో బెటరని బీఆర్ నాయుడు అభిప్రాయపడ్డారు.






