- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల ఉసురు తగిలి 11 సీట్లే వచ్చాయి: జగన్‌పై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫైర్
లిక్కర్ కేసు అరెస్ట్‌లు హాట్ టాపిక్‌గా మారాయి. ...

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు అరెస్ట్(Liquor Case Arrest)లు హాట్ టాపిక్‌గా మారాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) నేతలు వరుసగా జైలుకు వెళుతుంటే.. టీడీపీ(TDP) నేతలు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. దీంతో లిక్కర్ కేసు వ్యవహారం నాయకుల మధ్య రాజకీయ వేడిని పుట్టించింది. అక్రమంగా కేసులు పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అటుంటే.. తప్పు చేసి దబాయిస్తున్నారంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు(MLA Adireddy Vasu) స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ(Kakinada)లో ఆయన మాట్లాడుతూ జగన్ హయాంలో కల్తీ లిక్కర్ తో జనాల ప్రాణాలతో చెలగాటమాడారన్నారు. కల్తీ మద్యం తాగిన ప్రజలకు లివర్ సమస్యలు వస్తున్నాయి. రాష్ట్రంలో తప్ప ఇలాంటి కేసులు ఎక్కడా నమోదు కాలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మహిళల ఉసురు తగిలిందని, అందుకే ఆ పార్టీ 11 సీట్లు వచ్చాయని విమర్శించారు. తప్పు చేసిన వారిని కాలం అసలు వదిలిపెట్టదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హెచ్చరించారు.






