- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరెస్టుల వల్ల నా రోమాలు కూడా ఊడవు.. ప్రస్తుత మంత్రిపై మాజీమంత్రి ఫైర్
మంత్రి చెబుతున్న అరెస్ట్ ల వల్ల నా చేతి మీద రోమాలు కూడా ఊడవని మాజీమంత్రి, వైసీపీ నేత పేర్నినాని (YCP Leader Perni Nani) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మంత్రి చెబుతున్న అరెస్ట్ ల వల్ల నా చేతి మీద రోమాలు కూడా ఊడవని మాజీమంత్రి, వైసీపీ నేత పేర్నినాని (YCP Leader Perni Nani) అన్నారు. విజయవాడ (Vijayawada) జైళ్లో ఉన్న వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi)ని పేర్ని నానితో పాటు వంశీ భార్య పంకజ (Pankaja) ములాకత్ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాని మాట్లాడుతూ.. మంత్రి కొల్లు రవీంద్ర (Minister kollu Ravindra)పై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పోలీసులు (Police) దిగజారి ప్రవర్తిస్తున్నారని, అధికార పార్టీ లో ఉన్న నేతలను సంతృప్తి పర్చేందుకు వైసీపీ నాయకుల (YCP Leaders)ను టార్గెట్ (Target) చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే వంశీపై, తనపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని పేర్ని నాని విమర్శించారు. అలాగే 10వ తేదీన సత్య వర్థన్ కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చారని, 11వ తేదీన 5 క్రిమినల్ కేసులు ఉన్న ఓ టీడీపీ వ్యక్తితో ఫిర్యాదు తీసుకుని కేసు పెట్టినట్లు చెప్పారు.
అంతేగాక 12వ తేదీన సత్యవర్థన్ అన్నతో నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేయించి కేసు పెట్టారని, ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్లకు కేసుతో సంబంధం లేదని అన్నారు. వైసీపీ నేతలపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక వైసీపీ అధినేత జగన్ ఇటీవల జరిపిన పర్యటనలో తాను కూడా పాల్గొన్నానని, కానీ జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనలో తాను లేనని స్పష్టం చేశార. అయినా సరే తన మీద కేసు పెట్టారని అన్నారు. వైఎస్ఆర్సీపీలో క్రియా శీలకంగా వ్యవహరిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై అన్ని వివరాలతో డీజీపీకి లేఖ రాశానని అన్నారు. ఆ లేఖను మీడియాకు ఇస్తానని తెలిపారు. వైసీపీ నేతలను మానసికంగా ఇబ్బంది పెట్టిన వారిని కూడా కోర్టుకు లాగుతానని హెచ్చరించారు.
ఇక పోలీసులు వైసీపీ నేతలు, వాళ్ల ఫ్యామిలీ మెంబర్ల ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారని, వైసీపీ లీడర్ల భార్యల ఫోన్ నెంబర్లు పోలీసులకు ఎందుకో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో యాక్టివ్ గా ఉన్న నేతలు, వాళ్ల భార్యల ఫోన్ కాల్స్ ను రికార్డు చేస్తున్నారని, రమేశ్ హాస్పటల్స్ వద్ద 17 మంది కానిస్టేబుళ్లతో వింగ్ ఏర్పాటు చేసి ఫోన్స్ ట్రాప్ చేస్తున్నారని అన్నారు. కచ్చితంగా మీ తప్పులకు శిక్ష పడే రోజు వస్తుందని అన్నారు. ఒక మంత్రి గత ఏడాది నవంబర్ నుండి నన్ను అరెస్టు చేస్తానంటూ మొరుగుతున్నాడని, తాను ఎప్పుడు రోడ్ల మీదే తిరుగుతున్నానని, దమ్ముంటే అరెస్ట్ చేసుకోవాలని సవాల్ విసిరారు. అంతేగాక ఆయన అరెస్టుల వల్ల నా చేతి మీద రోమాలు కూడా ఊడవని, అరెస్టులకు భయపడేది లేదని మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.






