Home minister Anitha: పారదర్శకంగానే అరెస్టులు

by Thanuru Gopichand |

అన్ని సాక్ష్యాలు సేకరించన తర్వాతనే, పాదర్శకంగా అరెస్టులు జరుగుతున్నట్లు హోమంత్రి వంగలపూడి అనిత అన్నారు.

Home minister Anitha: పారదర్శకంగానే అరెస్టులు
X

వైసీపీ హయాంలోనే పరాకాష్టకు రాజకీయ హింస

హోమంత్రి వంగలపూడి అనిత

దిశ, డైనమిక్ ​బ్యూరో: అన్ని సాక్ష్యాలు సేకరించన తర్వాతనే, పాదర్శకంగా అరెస్టులు జరుగుతున్నట్లు హోమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ రోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ మీరు చెప్పిన తప్పుడు పనులు చేయడం వల్ల ఐపీఎస్​లు నష్టపోతున్నారని అన్నారు. నాలుగు గదుల మధ్యలో చెప్పడం కాదు.. జగన్ (YS Jagan)​ బయటకు వచ్చి చెప్పాలని అన్నారు. తమ నాయకులు ఎంతమందిపై కేసులు పెట్టారో అందరికీ తెలుసునని అన్నారు. మా పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే దానిని జగన్​ ఖండించలేదన్నారు. తాము పారదర్శకంగా చర్యలు చేపడుతున్నట్లు హోమంత్రి అనిత తెలిపారు. వృద్ధులు అని చూడకుండా మహిళలు అని చూడకుండా గతంలో అరెస్టులు చేశారని అన్నారు. జగన్​చేత శభాష్​ అని అనిపించుకోవడానికి కొందరు పోలీసులు పనిచేశారని అన్నారు. దళిత డ్రైవర్​హత్య కేసులో లోతుగా విచారణ జరిపేందుకు కోర్టు అనుమతి కోసం వెళుతున్నట్లు పేర్కొన్నారు. జత్వాని కేసులో కక్షసాధింపు ఏమీ లేదన్నారు. ఇందులో ఐపీఎస్​(IPS officers)అధికారులు ఇన్​వాల్యు అయినట్లు తేలిందన్నారు. మద్యం కుంభకోణం లో సిట్ (SIT)​విచారణ జరుగుతుందన్నారు. రాజకీయ హింస వైసీపీ హయాంలో పరాకాష్టకు వెళ్లిందన్నారు. ఎక్కడైనా శవం ఉంటే జగన్​రోడ్డు ఎక్కుతున్నాడని అన్నారు. అంతేకాని ప్రజల సమస్యలకోసం పోరాడడం లేదన్నారు.

Next Story