Arrest: ఏపీ లిక్కర్‌ స్కామ్ కేసులో కీలక పరిణామం.. సజ్జల శ్రీధర్‌ రెడ్డి అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-26 02:29:22  IST  )

వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Arrest: ఏపీ లిక్కర్‌ స్కామ్ కేసులో కీలక పరిణామం.. సజ్జల శ్రీధర్‌ రెడ్డి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ సర్కార్ (YCP Government) హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో A6గా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డి (Sajjala Sridhar Reddy)ని సిట్ అధికారులు హైదారాబాద్‌ (Hyderabad)లోని జూబ్లీహిల్స్‌ (Jubilee Hills)ఉన్న ఆయన నివాసంలో గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. కాసేపట్లో ఆయనను ఏసీబీ కోర్టు (ACB Court)లో హాజరుపరచనున్నారు. లిక్కర్ స్కామ్‌లో సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి (Raj Kasireddy)కాగా.. కమీషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్‌ రెడ్డి కీలకంగా వ్యహించినట్లుగా సీట్ గుర్తించింది.

కాగా, ఇదే కేసులో ఇప్పటికే రాజ్‌ కసిరెడ్డి (ఏ1), ఆయన తోడల్లుడు చాణక్య (ఏ8)ను అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త మద్యం పాలసీని అడ్డు పెట్టుకుని ప్రతినెలా రూ.60 కోట్ల మేర ముడుపులు సేకరించాలనే విషయంలో ఎంపీ మిథున్‌ రెడ్డి (Mithun Reddy), విజయసాయి రెడ్డి (Vijayasai Reddy), నాటి ఐటీ సలహాదారు రాజ్‌ కసిరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్‌ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి (Vasudeva Reddy), ఏపీఎస్‌బీసీఎల్‌ స్పెషల్ ఆఫీసర్ సత్య ప్రసాద్‌ (Satya Prasad)తో కలిసి శ్రీధర్‌రెడ్డి కూడా కుట్రలు చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే కేసులో శ్రీధర్‌ రెడ్డిని అరెస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Next Story