నేడు రెండు కార్పొరేషన్లకు మేయర్ ఎన్నిక.. ఏర్పాట్లు పూర్తి

by Jakkula.Mamatha |

విశాఖ గుంటూరు మేయర్ స్థానాలతో పాటు మొత్తం ఏడు ఖాళీ స్థానాలకు ఈ రోజు(సోమవారం) ఎన్నిక జరగనుంది

నేడు రెండు కార్పొరేషన్లకు మేయర్ ఎన్నిక.. ఏర్పాట్లు పూర్తి
X

దిశ,వెబ్‌డెస్క్: విశాఖ గుంటూరు మేయర్ స్థానాలతో పాటు మొత్తం ఏడు ఖాళీ స్థానాలకు ఈ రోజు(సోమవారం) ఎన్నిక జరగనుంది. విశాఖలో ఇప్పటికే అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆ స్థానం కూటమి ఖాతాలోకే వెళ్లనుంది. టీడీపీ జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును పార్టీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్ ఎన్నిక ఈరోజు ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ క్రమంలో జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మేయర్‌ను ఎన్నుకోనున్నారు.

ఇక గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ స్థానంలోనూ దాదాపు అధికార పార్టీకి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర, వైసీపీ నుంచి బరిలో అచ్చాల వెంకటరెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 11.00 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. మేయర్ పీఠం తమదేనంటూ కూటమి నేతల ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికకు 63 మంది సభ్యులకు గాను 32 మంది ఉంటేనే కోరం, 32 మంది లేకుంటే మరుసటి రోజుకు వాయిదా వేయడం జరుగుతుంది. పాలకొండ, తుని, కుప్పం ఛైర్‌పర్సన్ స్థానాలు, మాచర్ల, తాడిపత్రి, తునిలో 4 వైస్ చైర్మన్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story