ఏపీలో ఆర్మీ జవాన్ భూమి కబ్జా..లోకేష్, పవన్‌లకు రిక్వెస్ట్

by Ajay Maddhiboyina |

శ్రీ స‌త్య‌సాయి జిల్లా హుదుగూరులో ఆర్మీ జ‌వాన్ న‌ర‌సింహ‌మూర్తికి సంబంధించిన భూమిని కొంద‌రు క‌బ్జా చేశారు. దీంతో ఆయ‌న సెల్ఫీ వీడియో విడుద‌ల చేసి డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్

ఏపీలో ఆర్మీ జవాన్ భూమి కబ్జా..లోకేష్, పవన్‌లకు రిక్వెస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: శ్రీ స‌త్య‌సాయి జిల్లా హుదుగూరులో ఆర్మీ జ‌వాన్ న‌ర‌సింహ‌మూర్తికి సంబంధించిన భూమిని కొంద‌రు క‌బ్జా చేశారు. దీంతో ఆయ‌న సెల్ఫీ వీడియో విడుద‌ల చేసి డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్, మంత్రి లోకేష్ త‌నకు న్యాయం చేయాల‌ని కోరాడు. జమ్మూ నుండి వీడియో విడుద‌ల చేసిన జ‌వాన్.. భూమి త‌నదే అని కోర్టు కూడా తీర్పు ఇచ్చింద‌ని తెలిపాడు. కోర్టు తీర్పును ర‌క్షించాల్సిన రెవెన్యూ అధికారులు, పోలీసులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్, మంత్రి లోకేష్ త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరారు. మరోవైపు ఇటీవల సత్యసాయి జిల్లాలోనే మరో ఆర్మీ జవాన్ చౌడేశ్ సైతం తన భూమిని కబ్జా చేశారని ప్రజా సమస్యల పరిష్కార వేధికగా ఫిర్యాదు చేశాడు. గోరంట్ల మండలం రాగిమోలపల్లిలోని తన భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. మూడేళ్లుగా కలెక్టరేట్ చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దేశం కోసం జవాన్లు బార్డర్ లో పోరాడుతుంటే ఇక్క‌డ వాళ్ల భూములే క‌బ్జాకు గుర‌వ్వ‌డంతో ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Next Story