మహిళలంటే మీకు అంత చులకనా.. వైసీపీకి కిరాక్ ఆర్పీ స్ట్రాంగ్ కౌంటర్

by Kema Shiva Kumar |

రాజధాని అమరావతి (Amaravati) ప్రాంతంలో వేశ్యలు ఉన్నారంటూ మూడు రోజుల క్రితం సాక్షి టీవీ డిబేట్‌లో జర్నలిస్టులు కృష్ణంరాజు (Krishnam Raju), కొమ్మినేని శ్రీనివాస రావు (Kommineni Srinivasa Rao) చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

మహిళలంటే మీకు అంత చులకనా.. వైసీపీకి కిరాక్ ఆర్పీ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని అమరావతి (Amaravati) ప్రాంతంలో వేశ్యలు ఉన్నారంటూ మూడు రోజుల క్రితం సాక్షి టీవీ డిబేట్‌లో జర్నలిస్టులు కృష్ణంరాజు (Krishnam Raju), కొమ్మినేని శ్రీనివాస రావు (Kommineni Srinivasa Rao) చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లైవ్ డిబేట్ నెటింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇదే ఇష్యూపై కిరాక్ ఆర్పీ (Kirak RP) వైసీపీ లీడర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. కొమ్మినేనిది అక్రమ అరెస్ట్ అంటున్న వైసీపీ (YCP) నేతలు అసలు మనుషులేనా.. లేక జంతువులా అని ప్రశ్నించాడు. భారతీ రెడ్డి నడిపే మీడియా సంస్థలో సాటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు.

లైవ్ డిబేట్‌లో కొమ్మినేని, కృష్ణం‌రాజు ఏం మాట్లాడారో ప్రజలంతా చూశారని.. మళ్లీ మీడియా ముందు బుకాయించే ప్రయత్నం చేయోద్దని హితవు పలికాడు. అమరావతి ఆడపడచుల మానాలను అవమానిస్తుంటే.. నిత్యం మహిళా సాధికారత అంటూ లెక్చర్లు దంచే వైసీపీ మహిళా నేతలైన ఆర్కే రోజా, లక్ష్మీపార్వతి, శ్యామల ఇప్పుడు ఎక్కడా అని ప్రశ్నించారు. కొమ్మినేనికి జర్నలిస్టుగా 50 ఏళ్ల అనుభవం ఉందంటూ చెప్పుకుంటున్నాడని.. అదే నిజమైతే అలా డిబేట్‌లో నీచంగా ఎలా మాట్లాడనిచ్చారని ఫైర్ అయ్యారు. తప్పు చేసిన వారు ఎవరైనా వయసుతో సంబంధం లేదని.. అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరిని పోలీసులు పట్టుకెళ్తారని కామెంట్ చేశారు. ఇక మాజీ మంత్రి విడదల రజిని, సజ్జల రామకృష్ణా రావు, అంబటి రాంబాబు, మార్గాని భరత్‌లు కొమ్మినేనిది అక్రమ అరెస్ట్ అంటూ మీడియా ముందుకు వచ్చి స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని.. మహిళలంటే వారికి అంత చులకన అయిపోయిందంటూ కిరాక్ ఆర్పీ ధ్వజమెత్తారు.

Next Story