- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vamsi: వంశీకి ఏం తెలియదట.. మరోసారి కస్టడీ కోరే యోచనలో పోలీసులు?
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మూడు రోజుల పోలీసు కస్టడీ ఇవాళ్టితో ముగిసింది.

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మూడు రోజుల పోలీసు కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. విచారణ అనంతరం సాయంత్రం ఆయనను కృష్ణలంక పోలీసు స్టేషన్నుంచి విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. అంతకు ముందు ఆయనకు విజయవాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. కృష్ణలంక పీఎస్‌లోనే వంశీని మూడు రోజులు విచారించారు. సత్యవర్ధన్కిడ్నాప్కేసులో ఆయనను పటమట పోలీసులు ప్రశ్నించారు. వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణను కూడా విచారించారు. సత్యవర్ధన్కిడ్నాప్కేసులో ప్రమేయం ఉన్న వారిపై ఆరా తీసినట్లు సమాచారం. విశాఖ, తాడేపల్లి, హైదరాబాద్‌లో సేకరించిన ఆధారాల గురించి అడిగి తెలుసుకున్నారు. వంశీ చెబితేనే సత్యవర్ధన్‌ను తీసుకువెళ్లినట్లు మిగతా నిందితులు చెప్పినట్లు సమాచారం. అయితే తనకు ఏమీ తెలియదంటూ వంశీ పదే పదే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వంశీని మరోసారి కస్టడీలోకి తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నారు.






