Arava Sridhar: నా వ్యక్తిగత వీడియోలు తొలగించండి: హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-07 03:40:29  IST  )

Arava Sridhar: నా వ్యక్తిగత వీడియోలు తొలగించండి: హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్న తన వ్యక్తిగత వీడియోలు, ఫోటోలపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రైవసీకి భంగం కలిగించేలా ఉన్న ఆ కంటెంట్‌ను తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో హర్షవీణ అనే మహిళతో ఎమ్మెల్యే ఉన్న ఫోటోలు, వీడియోలను కొందరు ఉద్దేశపూర్వకంగా వైరల్ చేస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయిత అవి తన క్లయింట్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని, తక్షణమే వాటిని అన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.

కాగా, ఐదు రోజుల క్రితం గతంలో ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉన్న హర్షవీణ అనే మహిళపై తాతంశెట్టి నాగేంద్ర (Tathamshetty Nagendra) అనే వ్యక్తి దాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాతంశెట్టి నాగేంద్రపై ఇప్పటికే పోలీసులు ఎస్సీ, ఎస్టీ (SC/ST) అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల మధ్య ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియోలు బయటకు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన వ్యక్తిగత జీవితాన్ని అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుం వేచి చూడాల్సిందే మరి

Next Story