టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.

టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు APSRTC శుభవార్త చెప్పింది. పరీక్షలు రాసేందుకు వివిధ పరీక్షాసెంటర్లకు వెళ్లే విద్యార్థులకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 16వ తేదీ నుంచి ఏపీలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. అదే రోజు నుంచి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చునని సంస్థ తెలిపింది. హాల్ టికెట్ చూపించిన ప్రతీ విద్యార్థి ఫ్రీగా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహించే రోజుల్లో విద్యార్థుల్ని బస్ పాస్ చూపించాలని అడగవద్దని ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం సూచనలు చేసింది. రాష్ట్రంలో 6.42 లక్షల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనుండగా.. వారి సౌకర్యార్థం బస్సులను నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. మార్చి 16న ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో ముగియనున్నాయి.

Next Story