- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సొంతూళ్లకు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రిటర్న్ జర్నీ కోసం స్పెషల్ బస్సులు
సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లడానికే కాదు.. పండగ అయిపోయాక తిరిగి బ్రతుకుతెరువు కోసం ఉద్యోగాలు, పనుల కోసం సిటీలకు రావాలన్నా బస్సులు, రైళ్లతో పెద్ద యుద్ధమే చేయాలి.

దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లడానికే కాదు.. పండగ అయిపోయాక తిరిగి బ్రతుకుతెరువు కోసం ఉద్యోగాలు, పనుల కోసం సిటీలకు రావాలన్నా బస్సులు, రైళ్లతో పెద్ద యుద్ధమే చేయాలి. ఇప్పటికే రిజర్వేషన్లు ఉన్న బస్సులు, రైళ్లన్నీ ఫుల్లై పోగా.. చాంతాడంత వెయిటింగ్ లిస్టు, కొన్ని రైళ్లతే రిగ్రెట్ అంటూ రెడ్ కార్డును చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండక్కి సొంతూరికి వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రెగ్యులర్ గా వివిధ ప్రాంతాలకు తిరిగే బస్సులకు అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. తిరుగుపయనంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పలు ప్రాంతాల మధ్య 4,575 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి స్పెషల్ బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ కు 1800, బెంగళూరుకు 200, చెన్నైకి 75 స్పెషల్ బస్సులుు నడుపుతున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 2500 స్పెషల్ బస్సులను తిప్పనుంది. 71 శాతం స్పెషల్ సర్వీసులను నడుపుతున్న ఆర్టీసీ.. సాధారణ ఛార్జీలనే వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. సుదూర ప్రాంతాలకు నడిచే బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ఫెసిలిటీ కల్పించినట్లు తెలిపింది.
పండుగముందు..
పండుగ ముందు రోజుల్లో 3857 ప్రత్యేక బస్సులు నడపనుంది. వీటిలో హైదరాబాద్ కు 240, బెంగళూరుకు 102, చెన్నైకి 15 బస్సులు ఏర్పాటు చేయగా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 3500 స్పెషల్ బస్సులు తిరగనున్నాయి.






