ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు వర్షసూచన

by Naga Rani Yarlagadda |

ఏపీలో మండుటెండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారడంతో సేదతీరుతున్నారు.

ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు వర్షసూచన
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మండుటెండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారడంతో సేదతీరుతున్నారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈ పరిస్థితి గురువారం వరకూ ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రజలు హోర్డింగులు, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి వద్ద నిలబడవద్దని సూచించారు.

గురువారం (జూన్ 12) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూల్, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

Next Story