- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైక్లోన్ దిత్వాపై లేటెస్ట్ అప్డేట్.. మత్స్యకారులకు హెచ్చరిక
శ్రీలంక వద్ద ఏర్పడి భారత్ తీరం వైపు వచ్చిన తుపాన్ దిత్వా క్రమంగా బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక వద్ద ఏర్పడి భారత్ తీరం వైపు వచ్చిన తుపాన్ దిత్వా క్రమంగా బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారింది. దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని, ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు సమాంతరంగా కదులుతూ సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదిలిన తీవ్ర వాయుగుండం.. ప్రస్తుతం చెన్నైకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 130 కిలోమీటర్లు, నెల్లూరుకి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.
దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే కోస్తాంధ్రలో అక్కడక్కడా మోస్తరు నుంచి భార వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. మంగళవారం (డిసెంబర్ 2) వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు.






