- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బలపడిన అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి దగ్గరగా.. ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) మరింత బలపడుతోంది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి దగ్గరగా.. ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) మరింత బలపడుతోంది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ బెంగాల్ వైపు కదులుతూ.. గురువారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. వాయుగుండంగా కూడా మారే అవకాశాలున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains in AP) కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఉండవచ్చని హెచ్చరించారు.
బుధవారం కొన్నిప్రాంతాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటు.. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.






