APPSC : లెక్చరర్ పోస్టుల పరీక్షలు వాయిదా వేసిన సర్కార్

by Muthe.Rajitha |

ఏపీ(AP)లో జరగాల్సిన మరో పరీక్షలను వాయిదా(Exams Postponed) వేసింది కూటమి సర్కార్.

APPSC : లెక్చరర్ పోస్టుల పరీక్షలు వాయిదా వేసిన సర్కార్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో జరగాల్సిన మరో పరీక్షలను వాయిదా(Exams Postponed) వేసింది కూటమి సర్కార్. రాష్ట్రంలో జరగాల్సిన లెక్చరర్ పోస్టుల(Lecturer Posts) భర్తీ పరీక్షలను వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ఓ ప్రకటన జారీ చేసింది. ఏపీలో పలు లెక్చరర్ పోస్టుల(పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, TTD కళాశాలలు) కోసం జూన్ 16 నుండి 26 మధ్య జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయని పేర్కొంది. ఆడ్మినిస్ట్రేటివ్ సమస్యలు కారణాలతో ఈ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు చెప్పినప్పటికీ అసలు కారణం ఏమిటన్నది తెలియ రాలేదు.

కొత్త తేదీలను కమిషన్ ఇంకా ప్రకటించలేదు. నోటిఫికేషన్‌లు 13/2023, 16/2023, 17/2023 కింద 99 పాలిటెక్నిక్, 47 జూనియర్, 290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, TTD పోస్టులు భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. తాజాగా అవన్నీ వాయిదా పడ్డాయి.

Next Story