ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అటవీశాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

by Naga Rani Yarlagadda |

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్ఎస్ఓ) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అటవీశాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్ఎస్ఓ) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవ్వగా.. ఈనెల 28 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకూ ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఇక సెప్టెంబరులో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. పరీక్ష ఓఎంఆర్ రూపంలో ఉంటుందని తెలిపింది.

18 నుంచి 30 సంవత్సరాల వయసులోపు వారు అర్హులని, అభ్యర్థుల వయసు 01/07/2025 నాటికి 30 సంవత్సరాల వరకూ ఉండవచ్చని తెలిపింది. 18 సంవత్సరాల్లోపు, 30 సంవత్సరాలు దాటిన వారు అనర్హులని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 5 ఏళ్లు వయసు సడలింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూల్ జిల్లాల్లోని డివిజన్లలో పోస్టులు ఉంటాయని తెలిపింది.

Next Story