- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
APPSC పరీక్షల షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే అందుబాటులోకి హాల్‌టికెట్లు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాల(Govt Jobs) కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. త్వరలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తరుణంలో పలు పోటీ పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలో గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్(Assistant Tribal Officer) ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ను APPSC విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో పరీక్ష తేదీలను రిలీజ్ చేసింది. ఈ పరీక్షల కోసం ఈ నెల 28వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1, 30వ తేదీన పేపర్-2 ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్-పరీక్షలు నిర్వహించనుంది. అసిస్టెంట్ డైరెక్టర్(టౌన్ ప్లానింగ్) పరీక్షను ఈ నెల(ఏప్రిల్) 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పరీక్షలను ఈ నెల 28న ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. ఈ క్రమంలో నేడు(ఏప్రిల్ 18) హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ను సందర్శించండి.






