- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
APPSC Case: ఏపీపీఎస్సీ కేసు.. విజయవాడ కోర్టుకు PSR ఆంజనేయులు తరలింపు
గ్రూప్-1 (Group-1) ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ బాధ్యతలను క్యామ్‌సైన్ ప్రైవేట్ సంస్థకు అప్పగించడంలో ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu)పై కేసు నమోదైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 (Group-1) ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ బాధ్యతలను క్యామ్‌సైన్ ప్రైవేట్ సంస్థకు అప్పగించడంలో ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu)పై కేసు నమోదైన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా హాయ్‌ల్యాండ్ (Highland Resort) రిసార్ట్‌లో వాల్యుయేషన్ చేయించాలని నిర్ణయించడం మొదలుకుని కొటేషన్ పద్ధతిలో సదరు కంపెనీని ఎంపిక చేయడం వరకు ఆయన ఏకపక్షంగా వ్యవహరించినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో క్యామ్‌సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆంజనేయులుకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై పోలీసులు దృష్టి సారించగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ కోర్టులో హియరింగ్ ఉండటంతో విజయవాడ జిల్లా జైలు నుంచి పీఎస్‌ఆర్ ఆంజనేయులును పీటీ వారెంట్ (PT Warrant)పై పోలీసులు విజయవాడ కోర్టకు తీసుకొచ్చారు. మరికాసేపట్లో ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.
కాగా, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన పీఎస్‌ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu) హైకోర్టు (High Court)ను కూడా మోసం చేశారు. 2018లో విడుదలైన గ్రూప్-1 (Group-1) నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్స్ ఆన్సర్ షిట్ల విషయంలో డిజిటల్ వాల్యేయేషన్ రద్దు చేసి, మాన్యువల్ మూల్యాంకనం జరిపించాలని హైకోర్టు ఆదేశించింది. కానీ, ఆయన ఏకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. కోర్టు చెప్పినట్లు చేసినట్లుగా యాక్ట్ చేస్తూ.. హాయ్‌ల్యాండ్ వేదికగా నటకం నడిపారు. అంతకు ముందు డిజిటల్ వాల్యుయేషన్‌లో అభ్యర్థులకు వచ్చిన మార్కులనే మాన్యువల్ వాల్యుయేషన్ పేరిట క్యామ్‌సైన్ అనే ప్రైవేటు సంస్థతో నమోదు చేయించారు. కేసులో కీలక నిందితుడైన క్యామ్‌సైన్ డైరెక్టర్ మధుసూదన్ (Madhusudan)ను అరెస్టు చేసిన పోలీసులు బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆయనకు ఈనెల 21 వరకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు.






