వైసీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-19 16:37:49  IST  )

ఏపీలో వైసీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శుల‌ను నియ‌మిస్తూ ఆ పార్టీ కేంద్రం కార్యాల‌యం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

వైసీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వైసీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శుల‌ను నియ‌మిస్తూ ఆ పార్టీ కేంద్రం కార్యాల‌యం ఉత్త‌ర్వులు జారీ చేసింది. పార్టీ అధినేత జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు ఉమ్మ‌డి జిల్లాల‌కు ఒక్కో జిల్లాకు మ‌గ్గురు చొప్పున కార్య‌ద‌ర్శులను నియ‌మించింది. మొత్తం 48 మంది కార్య‌ద‌ర్శులను నియ‌మించింది. పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌ను వీరికి కేటాయించ‌బ‌డుతుంద‌ని పేర్కొంది.

కార్య‌ద‌ర్శులు పార్టీ కేంద్ర కార్యాల‌యంతో స‌మన్వ‌యం చేసుకుంటూ సంబంధిత రీజ‌న‌ల్ కో -ఆర్డినేట‌ర్లు, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కుల‌కు స‌హాయ‌కారిగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలిపింది. ఇదిలా ఉంటే ఓట‌మి త‌ర‌వాత జ‌గ‌న్ పార్టీని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మికి కార్య‌క్త‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మేన‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ముందుగా పార్టీని గాడిలో పెట్టాల‌ని అనుకుంటున్నారు. అందుకోస‌మే త‌ర‌చూ పార్టీ నేత‌లతో సమావేశాలు నిర్వ‌హిస్తూ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

Next Story