- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకం.. వివరాలు ఇవే.. AICC ప్రకటన విడుదల
ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కాంగ్రెస్ కమిటీల (డీసీసీ) అధ్యక్షుల నియామకాలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమోదం తెలిపినట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రకటించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కాంగ్రెస్ కమిటీల (డీసీసీ) అధ్యక్షుల నియామకాలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమోదం తెలిపినట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రకటించింది. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ నియామకాలు జరిగినట్లు ఏఐసీసీ తెలిపింది. ఈ ప్రక్రియలో ప్రతి జిల్లాకు నియమితులైన ఏఐసీసీ పరిశీలకులు విస్తృత సమీక్షలు నిర్వహించి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర భాగస్వాములతో చర్చలు జరిపిన అనంతరం సమగ్ర నివేదికలు సమర్పించారు. ఆ నివేదికల ఆధారంగా పరిశీలకులతో పాటు సీనియర్ నాయకులతో ఒక్కొక్కరిగా చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మొత్తం 41 మంది డీసీసీ అధ్యక్షులు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 41 జిల్లాలు/నగర కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులను నియమించారు. అల్లూరి సీతారామరాజు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి తదితర జిల్లాలు, నగర కమిటీలకు నూతన నాయకత్వం ఏర్పాటైంది. ఈ నియామకాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడమే లక్ష్యమని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డీసీసీ అధ్యక్షులు పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని పార్టీ అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.
డీసీసీ అధ్యక్షులు వీరే..






