Janasena Party : పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. జనసేనలో మార్పులు

by Javid Pasha |   (  Updated:2023-10-18 05:06:43  IST  )

జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ వ్యవహారాల కమిటీలో

Janasena Party : పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. జనసేనలో మార్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో కొత్తగా పడాల అరుణకు చోటు కల్పించింది. విజయనగరం జిల్లాకు చెందిన పడాల అరుణను కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యురాలిగా నియమిస్తూ జనసేన ప్రకటన జారీ చేసింది. ఈ కమిటీకి నాదెండ్ల మనోహర్ ఛైర్మన్‌గా ఉండగా.. నాగబాబు, పలువురు కీలక నేతలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

అలాగే మరికొంతమంది నేతలకు పార్టీ పదవులు జనసేన అప్పగించింది. పంచకర్ల రమేష్ బాబును ఉమ్మడి విశాఖ జిల్లా(రూరల్) జనసేన అధ్యక్షుడిగా నియామకం చేశారు. ఇక పత్సమట్ల ధర్మరాజుకు ఉంగుటూరు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్‌గా అవకాశం కల్పించగా.. ఉండి నియోజకవర్గ ఇంచార్జ్‌గా జుత్తిగ నాగరాజును పవన్ నియమించారు. వీరితో పాటు మరికొంతమందికి కీలక పార్టీ పదవులు దక్కాయి.

Next Story