- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు ఇన్‌ఛార్జ్ అధికారుల నియామకం: ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా వివిధ రంగాల్లో రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా అధికారులను నియమిస్తుంది. ఇందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు జిల్లా ఇన్‌ఛార్జ్‌లుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు జి. వీరపాండియన్, కాకినాడకు ప్రసన్న వెంకటేష్, బాపట్లకు మల్లికార్జున్, శ్రీ సత్యసాయి జిల్లాకు గంధం చంద్రుడు మరియు నంద్యాల జిల్లాకు సి.హెచ్. శ్రీధర్‌లను ఇన్‌ఛార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించారు.
లక్ష్యాల సాధన, శాఖల మధ్య సమన్వయమే ప్రధాన విధి
ఈ సీనియర్ అధికారులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేలా పర్యవేక్షించాల్సి ఉంటుంది. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని (Inter-departmental Coordination) మెరుగుపరచడం, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనుల అమలులో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి పాలనను వేగవంతం చేయడం వీరి ప్రధాన విధి. జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి మధ్య వీరు కీలక వారధిగా వ్యవహరించనున్నారు. దీంతో అన్ని వ్యవస్థలు సమన్వయంగా పని చేయడంతో పాటు వేగంగా చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
- Tags
- ap






