- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నామినేటెడ్ పదవుల భర్తీ.. 38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల నియామకం
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇటీవల కూటమి ప్రభుత్వం(AP Government) 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 37 చోట్ల టీడీపీకి(TDP) చెందిన వారికి, 8 చోట్ల జనసేన(Janasena) నేతలకు, 2 చోట్ల బీజేపీ(BJP) నేతలకు పదవులు దక్కినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ క్రమంలో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 38 మార్కెట్ కమిటీలకు నూతన ఛైర్మన్లను నియమిస్తూ గెజిట్ విడుదల చేసింది. ఇందులో 31 టీడీపీకి, 6 జనసేనకు, ఒకటి బీజేపీ దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే మిగిలిన కమిటీలకు ఛైర్మన్లను ప్రకటిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 218 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజా నియామకాలతో కలిపి ఇప్పటివరకు మొత్తం 85 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామక ప్రక్రియ పూర్తయింది.






