- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Special Teachers: ఏపీలో 2,260 స్పెషల్టీచర్ల నియామకం.. ఆమోదం తెలిపిన క్యాబినెట్
ఏపీలో 2,260 స్పెషల్టీచర్ల నియామకానికి రాష్ట్ర కేబినెట్ఆమోదం తెలిపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో 2,260 స్పెషల్టీచర్ల నియామకానికి రాష్ట్ర కేబినెట్ఆమోదం తెలిపింది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) అధ్యక్షతన ఏపీ కేబినెట్‌సమావేశం (Cabinet Meeting) జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీలో కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,136 ఎస్జీటీ, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అయితే రేపు జరగబోయే డీఎస్సీలో కాకుండా.. ఈ పోస్టులను ప్రత్యేకంగా తర్వాత డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని అప్పట్లో నిర్ణయించింది. ఈ రోజు జరిగిన కేబినెట్‌సమావేశంలో ఈ పోస్టుల భర్తీకి మంత్రివర్గ ఆమోదల లభించింది. అదే విధంగా ఈ రోజు జరిగిన కేబినెట్‌సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాల కేటాయింపునకు కేబినెట్అనుమతి లభించింది. తాడిమర్రిలో అదానీ పవర్‌కు 500 మెగావాట్ల పంప్డ్‌స్టోరేజి ప్రాజెక్టు కు భూమి కేటాయించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. రాజధాని అమరావతిలో బార్కౌన్సిల్ఆఫ్ ఇండియా ద్వారా లీగల్వర్సిటీ ఏర్పాటునకు నిర్ణయించారు. దుకాణాల ద్వారా రేషన్, ఇతర సరుకులు ఇచ్చే ప్రతిపాదనపై కూడా చర్చ జరిగింది. ఏపీ లెదర్ఫుట్వేర్పాలసీ 4.0కి ఆమోదం లభించింది. ముఖ్యంగా పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు కేబినెట్ఓకే చెప్పింది.
పారదర్శకంగా లిక్కర్కేసు విచారణ
ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ పాదర్శకంగా జరుగుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏపీ కేబినెట్ భేటీకి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వచ్చారు. లిక్కర్ స్కాం దర్యాప్తు వివరాలు కేబినెట్‍కు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎవరూ తొందరపడి మాట్లాడి అనవసర వివాదాలకు తావివ్వొద్దని సూచించారు.






