BRAGCET 2025: ఏపీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు

by Thanuru Gopichand |

ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (AP Gurukula Adimissions) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్​బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి మరియు ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తు స్వీకరణకు గడువు పొడిగించినట్లు సొసైటీ కార్యదర్శి పి. ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

BRAGCET 2025: ఏపీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (AP Gurukula Adimissions) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్​బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి మరియు ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం (ఆంగ్ల మాధ్యమం) లో ప్రవేశానికి దరఖాస్తు స్వీకరణకు గడువు పొడిగించినట్లు సొసైటీ కార్యదర్శి పి. ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈ నెల 13వ తేదీ వరకూ పొడిగించినట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలను ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ (Social Welfare) గురుకుల విద్యాలయాల సంస్థ వెబ్ సైట్ https://apbragcet.apcfss.in లో పొందవచ్చునని సూచించారు.

ఏపీలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో (APSWREIS) 5వ తరగతి, ఇంటర్​మొదటి సంవత్సరంలో చేరడానికి తొలుత ఈ నెల ఆరో తేదీ గడువు విధించారు. కాగా దీనిని పొడిగించారు. ఆన్​లైన్​లో ఈదరఖాస్తును స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. పరీక్షలో మెరిట్​ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా బోధన ఇంగ్లీష్​ మాధ్యమంలో ఉంటుంది.

Next Story