Group 2 Results : గ్రూప్ 2 ఫలితాలు విడుదల

by Muthe.Rajitha |

గ్రూప్ 2 పరీక్షల ఫలితాలు(Group 2 Results) ప్రకటించింది ఏపీ ప్రభుత్వం(AP Govt).

Group 2 Results : గ్రూప్ 2 ఫలితాలు విడుదల
X

దిశ,వెబ్ డెస్క్ : గ్రూప్ 2 పరీక్షల ఫలితాలు(Group 2 Results) ప్రకటించింది ఏపీ ప్రభుత్వం(AP Govt). 905 ఉద్యోగాలకు ఈ ఏడాది ఫిబ్రవరి 23 నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ(APPSC) విడుదల చేసింది. రిజల్ట్స్ తో పాటు ఫైనల్ కీ ని కూడా రిలీజ్ చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. మొత్తం 905 పోస్టులకు అన్ని కోటాలు కలిపి 2,517 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. తర్వాతి ప్రక్రియ కోసం ఇప్పటికే అభ్యర్థులకు కాల్ లెటర్స్ ద్వారా తెలియజేస్తామని కమిషన్ అధికారులు తెలిపారు.ఫైనల్ కీ, ఫలితాల కోసం APPSC అధికారిక వెబ్సైట్ లో తెలుసుకోవచ్చని వెల్లడించారు.

Next Story