- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా తప్పు లేకున్నా గవర్నర్‌కు సారీ : పవన్‌కల్యాణ్
శాసన సభ్యులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు

దిశ, డైనమిక్ బ్యూరో: శాసన సభ్యులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో ఆయన ఈ రోజు శాసనసభలో మాట్లాడారు. గవర్నర్‌ను గౌరవించే విధానం ఇదేనా అని ఆయన వైసీపీని ఉద్దేశించి అన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ నేతల ప్రవర్తన సరికాదన్నారు. అసెంబ్లీలో వారు చేసిన గొడవ చూస్తే వివేక హత్య గుర్తుకు వచ్చిందన్నారు. వైసీపీ నేతలు గొడవలకు, బూతులకు పర్యాయ పదాలుగా మారారన్నారు. చట్టాలు చేయాల్సిన వాళ్లే నియమాలు ఉల్లంఘిస్తే ఎలా అన్నారు. వైసీపీ నేతలు ఇక్కడ ఇలా ప్రవర్తిస్తే.. బయట ఇంకెలా ప్రవర్తిస్తారో అని అన్నారు. వారు చేసిన గొడవకు గవర్నర్‌కు తాను క్షమాపణ చెబుతున్నానని పవన్ అన్నారు. వైసీపీ నేతలు గవర్నర్ప్రసంగాన్ని బహిష్కరించడం దురదృష్టకరం అన్నారు. ఎన్‌డీఏ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలు ఆడిందన్నారు. గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు. జల్‌జీవన్ మిషన్ నిధులను దుర్వినియోగం చేసిందన్నారు. రాష్ర్టంలో ఎర్రచందనం పట్టుకుని ఇతర రాష్ట్రాలకు తరలించారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ మంత్రి 77 ఎకరాల అటవీ భూములను ఆక్రమించారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల్లో నాలుగు వేల కిలోమీటర్ల కు పైగా సీసీ రోడ్లు వేశామన్నారు. ఒకే రోజు 13, 326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును నొలకొల్పామన్నారు. మా ప్రభుత్వ హయాంలో 22 వేలకు పైగా గోకులాలను నిర్మించామని తెలిపారు.






