- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
APCC: సీఎం రేవంతన్నకు అభినందనలు.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రాన్ని(Telangana State) తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగడం అభినందనీయమని, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు(AP Congress Chief) వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రాన్ని(Telangana State) తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగడం అభినందనీయమని, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు(AP Congress Chief) వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై విజయోత్సవాల పేరుతో వేడుకలను నిర్వహిస్తోంది. దీనిపై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఏడాది పాలనపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్(CM Revanth Reddy) అన్నకి, సహచర మంత్రులకు, ఎమెల్యేలకు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.
అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, సంక్షేమ, అభివృద్ధి రాజ్యంగా, తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగడం అభినందనీయమని కొనియాడారు. అంతేగాక కాంగ్రెస్ తోనే రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుందని, హస్తమే దేశానికి అభయహస్తంగా నిలుస్తుందని షర్మిల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ.. తెలంగాణ మంత్రివర్గంలోని సభ్యులను ట్యాగ్ చేశారు.






