ఇరాన్‌లో ఏపీ యువకుడి విలవిల: స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యుల ఆవేదన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-10 11:22:51  IST  )

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్రిక్తతలు ఉత్తరాంధ్రలోని ఓ కుటుంబాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామంకు చెందిన కొమర సోమరాజు అనే యువకుడు ప్రస్తుతం ఇరాన్‌లో చిక్కుకుపోయారు...

ఇరాన్‌లో ఏపీ యువకుడి విలవిల: స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యుల ఆవేదన
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమాసియా(West Asia)లో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్రిక్తతలు ఉత్తరాంధ్ర(North Andhra)లోని ఓ కుటుంబాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. విజయనగరం జిల్లా(Vizianagaram District) పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామం(Chintapalli village)కు చెందిన కొమర సోమరాజు అనే యువకుడు ప్రస్తుతం ఇరాన్‌(Iran)లో చిక్కుకుపోయారు. ‘ఎమ్‌వీ పాస్కల్’ అనే నౌకలో ట్రైనీ వైపర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నౌకాశ్రయం సమీపంలో ఆగిపోయిన సముద్ర నౌకలోనే ఉండిపోయినట్లు సమాచారం. అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నౌక కదలికలు నిలిచిపోవడంతో యువకుడు తీవ్ర ఇబ్బందులు, మానసిక క్షోభను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

సోమరాజు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు

అయితే యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతంలో తమ కొడుకు చిక్కుకుపోవడంతో చింతపల్లిలోని సోమరాజు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బిడ్డను ఎలాగైనా రక్షించి సురక్షితంగా భారతదేశానికి రప్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఇరాన్ అధికారులతో విదేశాంగ శాఖ అధికారులు మాట్లాడి సోమరాజును స్వదేశానికి చేర్చేలా దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని బాధితుడి కుటుంబం గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story