- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు రాష్ట్రంలో వింత వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆ జిల్లాల్లో ఎండలు
by Naga Rani Yarlagadda |
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రేపు వింత వాతావరణం నెలకొననుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో ఈ అల్పపీడనం బలపడనున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. దీని ప్రభావంతో అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడుతాయని పేర్కొన్నారు. మరోవైపు అల్లూరి జిల్లా జీకే వీధి, ముంచింగిపుట్టు, పెద్దబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే ఛాన్సుందని, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక వరకూ ఈ ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు.
Next Story






